ELR: ఉంగుటూరు కేతాయి చెరువు దగ్గర నుంచి దొంతవరం వరకు తారు రోడ్డు మరమ్మత్తు పనులకు శుక్రవారం అధికారులు కొలతలు తీశారు. ఈ రహదారి గోతులతో అధ్వానంగా ఉండేది. ఎట్టకేలకు అధికారులు స్పందించి ఉంగుటూరు, రావులపర్రు, దొంత వరం గ్రామాల రహదారులకు వెడల్పు, పొడవు కొలతలు తీశారు. ఈ పనులు త్వరలో చేస్తామని ఆర్ అండ్ బి అధికారులు చెప్పారు.