ప్రకాశం: కంభం మండలంలోని ఎర్రబాలెం మరియు లింగాపురం గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట నష్టం అంచనా వేసేందుకు మొక్కజొన్న కంది, శెనగ పంటలను వ్యవసాయ అధికారి స్వరూప పరిశీలించారు. ఇప్పటివరకు సుమారు 700 ఎకరాల వరకు శెనగ పంట ప్రాథమికంగా నష్టపోయినట్టు నివేదికను పై అధికారులకు పంపించినట్లు తెలిపారు.