VZM: లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా వకుల్ జిందాల్ సూచించారు. గురువారం గంట్యాడ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా రక్షణ పోలీసులు దత్తత గ్రామాల పోలీస్ సిబ్బందితో మమేకమై వారి విధులపై దిశా నిర్దేశం చేశారు. ఇందులో డీఎస్పీ శ్రీనివాసరావు సీఐ లక్ష్మణరావు, ఎస్సై సాయి కృష్ణ పాల్గొన్నారు.