SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ కృష్ణాపురంలో గురువారం అధికారులు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మార్వో రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలు పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందన్నారు. రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజల నుంచి 15 వినతలు స్వీకరించినట్లు తెలిపారు.