»Rapaka Vara Prasad Makes Sensational Comments On Mlc Elections
Rapaka vara prasad:సిగ్గు, శరం వదిలేస్తే.. రూ.10 కోట్లు వచ్చేవి: రాపాక వర ప్రసాద్
Rapaka vara prasad:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు.
Rapaka vara prasad makes sensational comments on mlc elections
Rapaka vara prasad:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు. రాజోలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
మిత్రుడు కేఎస్ఎన్ రాజుతో (ksn raju) టీడీపీ నేతలు బేరం ఆడారని వివరించారు. అసెంబ్లీ వద్ద కూడా ఒక రాజు తనతో బేరాలకు దిగారని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని తెలిపారు. కానీ అందుకు అంగీకరించలేదని చెప్పారు.
ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమని చెప్పారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ.10 కోట్లు (10 crores) వచ్చేవని తెలిపారు. కానీ తాను సీఎం జగన్ను (jagan) విశ్వసించానని స్పష్టంచేశారు. టీడీపీ ఆఫర్ తిరస్కరించానని ఆయన వెల్లడించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున రాపాక వరప్రసాద్ (vara prasad) ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైసీపీకి అనుబంధంగా ఉంటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన.. రాపాక మాత్రం విజయం సాధించారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (anuradha) విజయం సాధించారు. అనురాధకు ఆనం రాంనారాయణ రెడ్డి (anam ram narayana reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy), ఉండవల్లి శ్రీదేవి (sirdevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (chandra shekar reddy) ఓటు వేశారట.. వారిని సస్పెండ్ చేశామని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ప్రకటించారు.