భారత మార్కెట్లో మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ-విటారా పేరుతో 2025 జనవరి 17న విడుదల కానుంది. దీని ధర ఇంకా ప్రకటించలేదు. కానీ, ఎక్స్‌షోరూమ్ ధర రూ.20 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రారంభించనున్నారు. ప్రయాణికుల భద్రతకు ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, అధునాతన భద్రతా ఫీచర్ అందుబాటులో ఉంటుంది.