AP: రాజస్థాన్లో నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై పయ్యావుల కీలక సూచనలు చేశారు. తన సూచనలపై వెంటనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రివర్గ ఉప సంఘం వేసినందుకు పయ్యావుల ధన్యవాదాలు తెలిపారు.