WNP: గణప సముద్రం భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నేత జబ్బార్ డిమాండ్ చేశారు. ఘనపూర్లోని గణప సముద్రాన్ని రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సందర్శించి పరిశీలించారు. జబ్బర్ మాట్లాడుతూ.. జలాశయ నిర్మాణానికి 420 ఎకరాలకు పైగా రైతులు భూములు కోల్పోతున్నారన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టంప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.