శీతాకాలంలో చలి తీవ్రతకు వేడివేడిగా ఆహారం తీసుకుంటారు. శరీరానికి వేడిని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో మునగ సూప్ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఓ గిన్నెలో మునక్కాడ ముక్కలు, పావుకప్పు ఉల్లిపాయలు, వెన్న, చిన్న అల్లం ముక్క, కాస్త జీలకర్ర, ఉప్పు వేసి పాత్రలో సగానికిపైగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ నీళ్లు సగానికి అయ్యాక పెప్పర్ పౌడర్ చల్లుకుని తాగాలి. ఈ సూప్ నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.