NDL: శ్రీశైలంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శ్రీశైలం కార్యనిర్వహణ అధికారి ఎం. శ్రీనివాసరావు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు సుమారు 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.