తమిళనాడులోని కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి భర్త చంపేశాడు. బ్యాగ్లో శరీర భాగాలు తీసుకెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. అనుమానంతో బైక్పై వెళ్తున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో బ్యాగ్లో మటన్ తీసుకెళ్తున్నట్లు బుకాయించేందుకు ప్రయత్నించాడు. బ్యాగ్ లాక్కొని తెరిచి చూడగా మహిళ శరీర భాగాలు కనిపించాయి. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.