TG: యూపీఎస్సీకి ధీటుగా టీజీపీఎస్సీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో నిన్న యూపీఎస్సీ కమిషన్ సభ్యులతో సమావేశమయ్యారు. యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో జరుగుతుందని, దీనికి అనుసరిస్తున్న పద్ధతులను వివరించినట్లు పేర్కొన్నారు.