సిరియాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల ధాటికి ఆ ప్రాంతం కంపించింది. ఈ ప్రకంపలను దాదాపు 820 కి.మీ దూరంలో ఉన్న టర్కీ పశ్చిమ ప్రాంత నగరం ఇస్నిక్లోని భూకంప సెన్సర్లు గుర్తించాయి. ఈ ప్రకంపనల తీవ్రత 3.0గా నమోదైందని తెలిపింది. 2012 తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన అత్యంత భీకర దాడి ఇదేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.