TG: గ్రూప్-2 పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది. నాలుగో పేపర్ రాస్తుండగా.. నగేశ్ అనే అభ్యర్థికి గుండెపోటు రావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరీక్ష కేంద్రం వద్ద విధుల్లో ఉన్న ఎస్సై వాహనంలో ఎక్కించుకుని ఆస్పత్రిలో చేర్చారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. అయితే, అతడికి మూర్చ వ్యాధి ఉందని, గుండెపోటు కాకపోవచ్చని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించామన్నారు.