నేడు వెస్టిండీస్‌తో మహిళల భారత జట్టు తొలి టీ20 ఆడనుంది. రాత్రి 7 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది. వెస్టిండీస్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. 2019 నుంచి విండీస్‌తో ఆడిన ఏడు టీ20ల్లోనూ గెలిచిన టీమిండియా.. ఇప్పుడా రికార్డును కొనసాగించాలనే లక్ష్యంతో ఉంది. షెఫాలివర్మ, యాస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, పూజ వస్త్రాకర్ లాంటి కీలక ప్లేయర్లు లేకుండానే భారత్ బరిలో దిగుతోంది.