భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 22న హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని ఆమె వివాహం చేసుకోనుంది. ఈ క్రమంలో ఇవాళ సింధు, వెంకటసాయిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు, మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు’ అని క్యాప్షన్‌ను జోడించింది.