SKLM: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో సులభ్ కాంప్లెక్స్ (పబ్లిక్ టాయిలెట్స్) నిర్మాణం చేపట్టాలని టెక్కలి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు జే. రాంజీ సోమవారం ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి వినతిపత్రం అందించారు. టెక్కలి పరిసర ప్రాంతాలు నుంచి వస్తున్న ప్రజలకు, విద్యార్థులకు, దినసరి కూలీలకు సులభ్ కాంప్లెక్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.