NTR: గంపలగూడెం మండలం పెద్దకొమెర గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో సోమవారం 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 100 సీట్లకు 249 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 198 మంది హాజరయ్యారు. 51 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ R. శైలజ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ M. క్రిస్టోఫర్ తెలిపారు.