ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్ నిలిచిన విషయం తెలిసిందే. చెస్ మేటి విశ్వనాథన్ ఆనంద్ (5సార్లు) తర్వాత జగజ్జేతగా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేశ్ రికార్డు సృష్టించాడు. అయితే, వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా) తొలి బ్యాచ్‌లో భాగంగా గుకేశ్ ఉన్నాడని.. అప్పుడే తనను మొదటిసారి చూసినట్లు విశ్వనాథన్ ఆనంద్ గుర్తుచేసుకున్నారు.