ఈనెల 21 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తలపడే హైదరాబాద్ జట్టుకు టీమిండియా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల మంచి ఫామ్లో ఉన్న అతడు కెప్టెన్గా కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా ఇటీవల టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సెంచరీలతో తిలక్ వర్మ రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ హైదరాబాద్కు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించాడు.