గబ్బా వేదికగా జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్టులో తొలి రోజు వర్షార్పణం అయింది. మొదటి సెషన్లో పలుమార్లు వర్షం కురవటంతో కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. ఆ తర్వాత వర్షం పెరగటంతో తర్వాతి రెండు సెషన్లు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. క్రీజులో ఖవాజా(19), మెక్‌స్వీనీ(4) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 28/0. అయితే రేపు కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.