SKLM: మందస మండలం మకరజోల గ్రామ సమీప జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటినవేళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీను వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.