VZM: రాజాం పట్టణం ఈశ్వర నారాయణ కాలనీలో అమరాన సత్యనారాయణ ఇంట్లో ఈరోజు చోరీ జరిగింది. ఇంటి తాళం విరగొట్టి బీరువాలోని సుమారు 20తులాల బంగారం వస్తువులు అపహరణకు గురైనట్లు యజమానులు గుర్తించారు. రూరల్ సీఐ ఉపేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి లోపల, పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.