TG: రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు TGPSC పలు సూచనలు చేసింది. ‘పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగా గేట్లు క్లోజ్ చేస్తాం. హాల్ టికెట్, ఫొటోతో ఉన్న గుర్తింపుకార్డు తీసుకురావాలి. పెళ్లైన మహిళలు మంగళసూత్రం, గాజులు ధరించవచ్చు. షూ వేసుకుని రాకూడదు. చెప్పులు మాత్రమే ధరించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి’ అని స్పష్టం చేసింది.