బాపట్ల: చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యంపై చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెరుకుపల్లిలో గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ మొబైల్స్ వ్యాపారం చేస్తున్న షేక్ మహమ్మద్ ఖాసీం వలీ ఈనెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఖాసీం తల్లి షేక్ కరిమున్నీసా శుక్రవారం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.