SRPT: సూర్యాపేట మండలం టేకుమట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని స్టేషన్కు తరలించారు.