AP: ఫోన్ ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. మొబైల్ డేటా అయిపోయిందని తల్లిని ఫోన్ అడగగా.. ఇవ్వలేదని తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు కోపంతో కత్తితో గొంతుపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె గాయాలపాలైంది. ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.