సినీ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.