అన్నమయ్య: పాల వ్యాన్ ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మదనపల్లి నక్కలదిన్నె తండాకు చెందిన చక్రినాయక్ బుధవారం రాయచోటి పెద్దబిడికిలో జరిగిన తన అన్నపెళ్లికి వెళ్ళాడు. సాయంత్రం బైక్పై ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని కురబలకోట మండలం ముదివేడు టోల్ ప్లాజా వద్ద పాలవ్యాను బైకును ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.