»Unfortunately I Am Member Of Parliament Row Over Rahul Gandhis Video
Rahul Gandhi: దురదృష్టవశాత్తు నేను ఎంపీని.. మాట జారిన రాహుల్, సెటైర్లే సెటైర్లు
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతుండగా, గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలు మరోసారి విరుచుకు పడేందుకు ఆస్కారం ఇచ్చాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను దురదృష్టవశాత్తు ఎంపీగా గెలిచానని వ్యాఖ్యానించాడు. దీనిని సరిద్దిదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జరగాల్సింది జరిగిపోయింది. దీంతో కేంద్రమంత్రులు ఆయన వ్యాఖ్యల పైన సెటైర్లు వేస్తున్నారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party senior leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్రిటన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతుండగా, గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతలు (BJP Leaders) మరోసారి విరుచుకు పడేందుకు ఆస్కారం ఇచ్చాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను దురదృష్టవశాత్తు ఎంపీగా గెలిచానని వ్యాఖ్యానించాడు. దీనిని సరిద్దిదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జరగాల్సింది జరిగిపోయింది. దీంతో కేంద్రమంత్రులు (Union Ministers) ఆయన వ్యాఖ్యల పైన సెటైర్లు వేస్తున్నారు.
నిన్న పార్లమెంటు వాయిదా పడిన అనంతరం రాహుల్ (Rahul Gandhi) పాల్గొన్న మీడియా సమావేశపు క్లిప్ వైరల్ గా మారింది. అందులో రాహుల్ గాంధీ… ‘దురదృష్టవశాత్తూ నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను’ అని అంటాడు. ఆ వ్యాఖ్యల వెనుక తప్పును గుర్తించిన కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్ (Jairam Ramesh) సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. రాహుల్ వైపు కాస్త వంగి సరిచేస్తారు. దురదృష్టవశాత్తూ నేను పార్లమెంటు సభ్యుడిని అయ్యానని వారు జోక్ చేయగలరు అని జైరామ్ చెప్పమన్నారు. ఆ వెంటనే రాహుల్… ఇక్కడ నేను మీకు ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మీ దురదృష్టం కొద్దీ నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను అని బీజేపీని (BJP) ఉద్దేశించి వ్యాఖ్యానించడం ద్వారా కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ క్లిప్ ను బీజేపీ వైరల్ చేసింది.
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రులు (Union Ministers) పీయూష్ గోయల్ (Piyush Goyal), ధర్మేంద్ర ప్రధాన్ లతో (Dharmendra Pradhan) పాటు బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దురదృష్టవశాత్తూ దీనిపై మాట్లాడేందుకు మా వద్ద పదాలు లేవని గోయల్, నిజంగా దురదృష్టకరమని ధర్మేంద్ర ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఒక విపత్తు.. తన పైన తనకే పట్టు ఉండదు, ఒకటి మాత్రం నిజం.. ఖర్గే, జైరామ్, అధిర్ వంటి వారు మసకబారిన అతని పరువును నేలమట్టం చేసేందుకు ఏ అవకాశం వదులుకోరు అని అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ట్యూటర్ లేకుండా రాహుల్ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేరంటూ ఆయన నాలుగు వీడియోలతో కూడిన ఓ ట్వీట్ చేశారు.
బీజేపీ నకిలీ వార్తలను తీసుకు వస్తోందని, రాహుల్ మాట్లాడే సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఆయన అలా మాట్లాడినప్పుడు తాను సర్ది చెప్పానని, ఆ వెంటనే అతను క్లారిటీగా మాట్లాడారని జైరామ్ రమేష్ అన్నారు. అయితే రాహుల్ గాంధీ ఆయన సూచనకు ముందు నేను దురదృష్టవశాత్తు ఎంపీగా అయ్యాననే వ్యాఖ్య చేసినట్లుగా జైరామ్ కూడా చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ దానిపై విమర్శలు గుప్పిస్తోంది.
Rahul Gandhi is an unmitigated disaster…शेर (since Congress insists he is one) नहीं ये तोता है, जो रटा दो वही बोलेगा।
He has no mind of his own…
One thing is for sure, people like Kharge, Jairam and Adhir are leaving no stone unturned to run his tattered reputation to ground. pic.twitter.com/fME5I7j2gc