WNP: మోరిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోటకు చెందిన సాకలి వెంకటస్వామి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న మోరీలో పడి బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలపగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.