ATP: విడపనకల్ మండలం కడదరబెంచి వద్ద ప్రమాదవశాత్తు కంకర క్వారీ మిషన్‌లో పడి బీహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ (19) అనే కూలి మృతి చెందాడు. క్వారీ మిషన్ ఆన్‌లో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడే ఉన్న తోటి కూలీలు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.