ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని భారీ స్థాయిలో పట్టుకున్నారు. పక్కా సమాచారంతో డెలివరీ చేస్తున్న రెండు అనుమానిత వస్తువులను పట్టుకోగా.. మైనపు రూపంలో ఉన్న 12.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.9.95 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు… ఆ విమానాశ్రయంలో పని చేస్తున్న ముగ్గురి వ్యక్తులతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.