సత్యసాయి: హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ హిందూపురం జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఇది బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించిన వారు, మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు, ఈ ఘటనపై న్యాయం చేయాలని కోరారు.