TG: మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ ఘటనపై నిరసనల్లో భాగంగా సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణ మాట్లాడారు. ‘మీడియా ఏం చేస్తుందనే అహంకారంతో మోహన్ బాబు దాడి చేశారు. మోహన్ బాబు తన దాదాగిరి బయట చూపించుకోవచ్చు కానీ.. ఇలా కాదు. ప్రభుత్వం కూడా ప్రేక్షకపాత్ర వహించకూడదు. మోహన్ బాబు ఉన్మాదంతో దాడి చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.