ఖమ్మం: మధిర మండలం ఇల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సీహెచ్ జగదీష్ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. ఈరోజు ఖమ్మంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేతుల మీదుగా మెమెంటో అందుకున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. అబ్దుల్ రషీద్ ప్రత్యేకంగా అభినందించారు.