MBNR: ఆటో కారు ఎదురుగా ఢీకొన్న ఘటన జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలం బస్వాపూర్ గేట్ సమీపంలో నాగారంకు చెందిన వర అనే వ్యక్తి దేవరకద్ర నుంచి సొంత ఊరికి ఆటోలో వెళ్తున్నారు. ఈక్రమంలో కోయిల్ సాగర్ నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.