E.G: రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానంలో అథ్లెటిక్స్ ట్రాక్ గ్రౌండ్లో ఈనెల 6, 7 తేదీల్లో ఆదికవి నన్నయ యూనివర్శిటీ అంతర్ కళాశాలల మెన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్‌కు యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల నుంచి క్రీడాకారులు రానున్నారని కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్కా తెలిపారు. యూనివర్శిటీ జట్టును ఎంపిక చేస్తారన్నారు.