స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్పై ఆయన సతీమణి అనుష్క ఆసక్తికర వాఖ్యలు చేశారు. ‘నిజాయితీగా చెబుతున్నా.. అతడు ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో కఠినంగా ఉంటాడు. ఉదయాన్నే కచ్చితంగా నిద్రలేచి వ్యాయామం చేస్తాడు. జంక్పుడ్, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. చికెన్ తిని 10 ఏళ్లు అవుతుంది అంటే నమ్ముతారా?. నిద్ర, విశ్రాంతి విషయంలో అసలు రాజీ పడడు. అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి అది చాలా కీలకం’ అని తెలిపారు.