TG: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప-2 మూవీని ప్రీమియర్ షో ప్రదర్శించగా.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయకపోవడంవల్లే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా, ఆమె కుమారుడు మరణించిన విషయం తెలిసిందే.