»Joe Biden On Silicon Valley Bank Why Silicon Valley Bank Collapsed He Just Walks Away
Joe Biden On Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంకుపై ప్రశ్నించగానే లేచి వెళ్లిపోయిన బిడెన్
అమెరికా అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden) మరోసారి విలేకరుల సమావేశం (Press Meet) నుండి వెళ్లిపోయారు. మీడియాతో భేటీ సందర్భంగా రిపోర్టర్ లు కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు ( Why Silicon Valley Bank collapsed) గురించి ప్రశ్నించారు. దీంతో బిడెన్ వారికి ముఖం చాటేశారు.
అమెరికా అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden) మరోసారి విలేకరుల సమావేశం (Press Meet) నుండి వెళ్లిపోయారు. మీడియాతో భేటీ సందర్భంగా రిపోర్టర్ లు కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు ( Why Silicon Valley Bank collapsed) గురించి ప్రశ్నించారు. దీంతో బిడెన్ వారికి ముఖం చాటేశారు. వారు ప్రశ్నలు సంధిస్తుంటే అవేం పట్టనట్లుగా (Joe Biden On Silicon Valley Bank) అక్కడి నుండి వెళ్లిపోయారు. ‘ప్రెసిడెంట్ గారు… ఇలా ఎందుకు జరిగింది. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా, దీని వలన ఎలాంటి దుష్ప్రభావం ఉండదని అమెరికా ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు’ (assurence to americans) అని రిపోర్టర్ సూటిగా అడిగారు. దీనిపై ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. మార్చి 10వ తేదీన స్టార్టప్ కేంద్రీకృత రుణదాత SVB ఫైనాన్షియల్ గ్రూప్ (startup-focused lender SVB Financial Group) కుప్పకూలిన విషయం తెలిసిందే. 2008 ఆర్థిక సంక్షోభం (2008 financial crisis) తర్వాత విఫలమైన అతిపెద్ద బ్యాంకుగా పేరు పడింది. ప్రపంచ మార్కెట్ల పైన ఈ ప్రభావం భారీగానే చూపింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అమెరికా అధ్యక్షులు (US President Joe Biden) మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లోను నిలకడ కలిగిన బ్యాంకింగ్ వ్యవస్థ (banking system) ఉంటుందని, బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి అపనమ్మకం వద్దని, అలాగే మన చారిత్రక ఆర్థిక పునరుద్ధరణను కాపాడుతామని చెప్పారు. అలాగే, డిపాజిటర్ల డబ్బుకు (depositers money) ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.
ఈ సమయంలో రిపోర్టర్ లు… బ్యాంకు కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీని పరిణామాలు ప్రజల పైన ఉండవని హామీ ఇస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఏం పాలుపోని జో బిడెన్ అక్కడి నుండి వెళ్లిపోవడం ప్రారంభించారు. మరికొందరు రిపోర్టర్ లు… మరికొన్ని బ్యాంకులు ఇదే దారిలో పతనమయ్యే ప్రమాదం పొంచి ఉందా అని ప్రశ్నించారు. అయితే అమెరికా అధ్యక్షుడైన బిడెన్ మాత్రం ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆ ప్రెస్ మీట్ గది నుండి వెళ్లిపోయారు. జో బిడెన్ తీరు పైన నెటిజన్లు విమర్శలు (social media triggered massive backlash) కురిపిస్తున్నారు.
అధ్యక్ష బాధ్యతల్లో ఉండి అమెరికా ప్రజలకు కనీసం హామీ ఇవ్వలేకపోవడంపై అమెరికా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జో బిడెన్ (US President Joe Biden) తీరుపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేవలం ఆయన చెప్పాలనుకున్నది చెప్పి… రిపోర్టర్ ల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోవడం ఏమిటని నిలదీస్తున్నారు. గతంలోను ఆయన ఇలాగే వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితమే చైనా గూఢచారి బెలూన్ పైన (China’s spy balloon) ఓ విలేకరి… మీరు కుటుంబ వ్యాపార సంబంధాల కారణంగా రాజీ పడ్డారా అని ప్రశ్నించారు. దీనికి బిడెన్… నాకు కాస్త విరామం ఇవ్వండి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.