ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కోసం ఇవాళ రాత్రి 9:30 గంటలకు బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. కాగా, విడుదలకి ముందే ‘పుష్ప2’ రికార్డుల వేట మొదలైంది. మంగళవారం సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీ సేల్స్ రూపంలోనే రూ.100 కోట్లు వసూళ్ల మైలురాయిని అధిగమించింది.