‘పుష్ప 2’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ‘పుష్ప 2’ సినిమా తీశారని శ్రీశైలం అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. మార్పులు సూచించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది తెలిపారు. ఊహాజనిత ఆరోపణల ఆధారంగా చిత్రం విడుదల నిలిపివేయలేమని స్పష్టం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు పిటిషనర్‌కు జరిమానా విధించింది.