సంక్రాంతి రేసు నుంచి ఒక్కో సినిమా తప్పుకుంటోంది. గేమ్ ఛేంజర్, విదాముయర్చి లాంటి భారీ చిత్రాలు పండగకి వస్తుండటంతో కాంపిటీషన్ ఏర్పడింది. దీంతో పొంగల్‌కు విడుదల చేద్దామనుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ తప్పుకోగా తాజాగా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కూడా పొంగల్ దంగల్ నుంచి వైదొలిగాడు. విక్రమ్ యంగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌తో వీర ధీర సూరన్2ను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నా అజిత్ విదాముర్చి ఎంట్రీతో విక్రమ్ సైడ్ అయ్యాడు.