KKD: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడతారా అంటూ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ ప్రశ్నిస్తున్నారు. సోమవారం పెద్దాపురం మున్సిపల్ సాగర్ హైస్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకాన్ని మానవ హక్కుల సంఘం సభ్యులు పరిశీలించారు. పౌష్టికాహారాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించిన ఇక్కడ అమలు కావడం లేదన్నారు.