హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో నటి శోభిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. డాక్టర్లు ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో శోభితది.. ఆత్మహత్యగా స్పష్టం చేశారు. ఆమె శరీరంపై ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు, గాయాలు లేవని నిర్ధారించారు. కాగా, నటి రూమ్లో దొరికిన సూసైడ్ నోట్లో ‘సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్’ అని రాసి ఉంది. ఈ వ్యాఖ్యల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.