»10 Year Old Girl Who Thwarted An Attack The Thief At Pune Maharashtra Netizens Praise
Viral Video: దొంగను చితకబాదిన 10 ఏళ్ల చిన్నారి..నెటిజన్ల ప్రశంసలు
ఓ 10 ఏళ్ల బాలిక(10 years old girl) తన అమ్మమ్మ గొలుసును లాక్కోవడానికి వచ్చిన దొంగను(thief) చితకబాదింది. దీంతో చైన్ స్నాచర్ పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్(viral video) కావడంతో మార్చి 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో జరిగింది.
సాధారణంగా చిన్నపిల్లలు దొంగలను చూస్తే భయాందోళన చెందుతారు. వారి పరిధిలోకి దుండగులు వస్తే చాలు పారిపోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఓ పదేళ్ల బాలిక(girl) మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. వారి దగ్గరకు వచ్చిన ఓ ముసుగు దొంగను(thief) చితకబాది అతను పారిపోయే విధంగా చేసి ఔరా అనిపించుకుంది. ఈ ఘటన ఇటీవల మహారాష్ట్ర(maharashtra) పూణె(pune)లోని ఓ వీధిలో చోటుచేసుకోగా..ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో తెక చక్కర్లు కోడుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే మహారాష్ట్ర(maharashtra) పూణె(pune)లోని ఓ వీధిలో ఇటీవల తన అమ్మమ్మతో కలిసి ఓ పదేళ్ల బాలికతోపాటు(10 years girl) ఇంకో చిన్నారి నడుచుకుంటు వెళుతున్నారు. ఆ క్రమంలో స్కూటీపై(scooty) వచ్చిన ఓ వ్యక్తి వారిని దారి అడిగినట్లు చేసి.. ఆ చిన్నారి అమ్మమ్మ చైన్‌ను(chain) లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె అరవడం ప్రారంభించి అతని కాలర్‌ను పట్టుకుంది. అది గమనించిన పదేళ్ల చిన్నారి రుత్వి ఘాగ్ తన చేతిలో ఉన్న బ్యాగ్‌తో దొంగను కొట్టడం ప్రారంభించింది. ఆ విధంగా చిన్నారి పదే పదే అతని తలపై బ్యాగుతో కొట్టడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమయంలో ఆ మహిళ పడిపోగా…ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో(cc camera) రికార్డైంది. ఈ వీడియో(video) కాస్తా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్(viral)గా మారింది. దీంతో పోలీసులు వివరాలు ఆరా తీసి మార్చి 8న కేసు నమోదు చేశారు.
#WATCH | A 10-year-old girl foiled an attempt by a chain snatcher to snatch her grandmother's chain in Maharashtra's Pune City
The incident took place on February 25 & an FIR was registered yesterday after the video of the incident went viral.
కేసు నమోదు చేసిన పోలీసులు(police) ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగ చైన్ కోసం విఫలయత్నం చేసిన వీడియో కనిపించింది. ఈ సంఘటన ఫిబ్రవరి 25న జరుగగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియా(social medai)లో పోస్ట్ చేయగా..పలువురు నెటిజన్లు(netizens) బాలిక ధైర్యానికి హ్యాట్సాఫ్ అని మెచ్చుకుంటున్నారు. మరికొంత మంది అయితే 15 రోజుల క్రితమే నేరం జరిగితే ఎందుకు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నిస్తున్నారు.