కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ELI స్కీమ్ ప్రయోజనాల కోసం ఆధార్ అనుసంధాన UAN యాక్టివేట్ చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరి PF ఉన్నవారు అర్హులు. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు మూడు విడతల్లో 15 వేల వరకు సాయం అందుతుంది. ఉద్యోగికి, యజమానికి ప్రోత్సాహకాలు, ప్రతి కొత్త ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్లపాటు నెలకు రూ.3 వేల వరకు కేంద్రం ఇస్తుంది.