»Mlc Kavitha Invites Congress To Delhi Protest Praises Sonia Gandhi
MLC Kavitha: సోనియా గాంధీకి కవిత ప్రశంసలు, తన వద్దకు ఆహ్వానం!
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharata Rashtra Samithi - BRS), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు (Congress Party) సోనియా గాంధీ (Sonia Gandhi) పైన ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharata Rashtra Samithi – BRS), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు (Congress Party) సోనియా గాంధీ (Sonia Gandhi) పైన ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (delhi liquor scam case) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆమె రేపు.. శనివారం ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరు కానున్నారు. అంతకంటే ముందు ఈ రోజు (శుక్రవారం, మార్చి 10) పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును (women reservation bill) ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద (delhi jantar mantar) నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష (Jantar Mantar for Women’s Reservation Bill) సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. ఈ దీక్ష నేపథ్యంలో కవిత… సోనియా గాంధీ పైన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు.
తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు రాజకీయ వైరి పక్షాలుగా ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) భావిస్తోంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో (Revanth Reddy, Telangana Congress president) తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతోంది. ఇలాంటి సమయంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల తర్వాత అయినా ఒక్కటి అవుతాయని బీజేపీ నేతలు మొదటి నుండి చెబుతున్నారు. ఇప్పుడు కవిత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
చాలా రోజుల తర్వాత మొదటిసారి కేసీఆర్ కుటుంబం నుండి లేదా బీఆర్ఎస్ పార్టీ నుండి సోనియా గాంధీకి ప్రశంసలు లభించాయి. కవిత మాట్లాడుతూ… కాంగ్రెస్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును (women reservation bill) ప్రవేశ పెట్టడమే కాకుండా, అన్ని పార్టీలను ఏకతాటి పైకి తేవడానికి కృషి చేసినందుకు గాను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి థ్యాంక్స్ అన్నారు కవిత (MLC Kavitha thanks Sonia Gandhi). 2008లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేసినందుకు గాను ఆమెకు సెల్యూట్ అన్నారు. అలాగే, వాజపేయిని కూడా ప్రశంసించారు. అంతేకాదు, తన నిరసన దీక్షకు ఆ పార్టీ నుండి ప్రతినిధులను పంపించాలని కూడా ఆ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ కు విజ్ఞప్తి చేశారు.
మద్యం కుంభకోణం కేసులో (delhi liquor case) పూర్తిగా ఇరుక్కుపోయి, అరెస్ట్ అవుతానే భయంతోనే కవిత హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని నెత్తికెత్తుకున్నారని బీజేపీ, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో స్వయంగా కవిత తండ్రి అధికారంలో ఉన్నారని, అక్కడ మహిళలకు న్యాయం చేయకుండా, ఢిల్లీలో దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. మహిళలకు న్యాయం చేయాలని కవిత మొదట తన తండ్రి కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేయాలని వైయస్సార్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) చురకలు అంటించారు. బీఆర్ఎస్ లో మహిళలకు ప్రాధాన్యత లేకపోవడంపై ఆమె స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళా గవర్నర్ పైన సొంత పార్టీ నేత ఇష్టారీతిన మాట్లాడితే, ప్రభుత్వం ఆమెను అవమానిస్తే మాట్లాడని కవిత దీక్ష చేయడం ఏమిటని ప్రశ్నించారు.