»Oyo Founder Ritesh Agarwal Wedding Softbank Ceo Masayoshi Son Legs Planted Couple
OYO Founder Ritesh:పెళ్లి…సాఫ్ట్‌బ్యాంక్ CEO కాళ్లు మొక్కిన దంపతులు
OYO రూమ్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహ రిసేప్షన్ వేడుక మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్, అతని భార్య మసయోషి పాదాలను తాకి ఆశీర్వదించాలని కోరారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
OYO రూమ్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్(Ritesh Agarwal) వివాహ రిసేప్షన్ వేడుక మంగళవారం న్యూఢిల్లీలో(delhi) ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్(Softbank CEO) వ్యవస్థాపకుడు మసయోషి సన్(Masayoshi Son) హాజరయ్యారు. ఈ క్రమంలో 65 ఏళ్ల పెట్టుబడిదారుడు మసయోషి పాదాలను రితేష్, అతని భార్య తాకి ఆశీర్వదించాలని కోరారు. ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారతీయ సంప్రదాయం ప్రకారం పెద్ద వారిని పలు వేడుకల్లో ఆశీర్వదించాలని కోరడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయంగా చెప్పవచ్చు. గీతాన్షా సూద్(Geetansha Sood)తో అగర్వాల్ కు పెళ్లి కాగా. ఈ జంట మార్చి 7న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో వివాహ విందును ఏర్పాటు చేశారు.
అంతేకాదు ఈ వేడుకకు డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ, లెన్స్‌కార్ట్ CEO పీయూష్ బన్సాల్ సహా వివిధ స్టార్టప్ వ్యవస్థాపకులు హాజరయ్యారు. దీంతోపాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్(union minister prahlad singh patel) దంపతులు(couple) కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి అభినందనలు తెలియజేశారు.
మసయోషి సన్(Masayoshi Son) ఇండియా(india) వచ్చిన క్రమంలో Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ వర్మ(vijay shekhar sharma) సంతోషంతో ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉందంటూ యోషితో నవ్వుతున్న చిత్రాన్ని పంచుకున్నాడు. అతని భారత పర్యటన ఆనందాన్ని ఇస్తుందన్నారు. అంతేకాదు తమ స్టార్టప్‌లకు ఆయన అందించిన మద్దతుతోపాటు నమ్మకానికి ప్రతి ఒక్కరం టన్నుల కొద్దీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు వెల్లడించారు.
Ultimate joy today, seeing Masa smiling, happy and enjoying his India trip. Everyone of us had tons of gratitude for his belief and support given to our Startups. pic.twitter.com/pt33w0AwyE
— Vijay Shekhar Sharma (@vijayshekhar) March 7, 2023
భారతీయ స్టార్టప్ వ్యవస్థలో సాఫ్ట్‌బ్యాంక్(Softbank) ప్రముఖ పెట్టుబడిదారుగా ఉంది. అనేక సంవత్సరాలుగా దాదాపు 15 బిలియన్ డాలర్లను ఇన్ వెస్ట్ చేసింది. వాటిలో ఓలా, ఓయో, లెన్స్‌కార్ట్, మీషో వంటి సంస్థలు ఉన్నాయి. అయితే ఎక్కువగా వ్యక్తిగత సమావేశాలను జూమ్ కాల్ ద్వారా నిర్వహించే మసయోషి ఈసారి ఇండియా(india) రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాము ఇష్టపడే టోక్యోకు చెందిన పెట్టుబడిదారుడు భారత్ రావడం అభినందనీయమని అంటున్నారు.